ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణవాసిపై కాల్పులు - telangana

అమెరికాలోని ఫ్లోరిడాలో తెలంగాణవాసిని బలితీసుకున్నారు దుండగులు. డిపార్ట్​మెంటల్​ స్టోర్​లోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. హైదరాబాద్​ ఉప్పల్​లో నివసిస్తున్న మృతుని కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు.

అమెరికాలో ప్రాణాలు కోల్పోయిన మృతుడి కుటుంబం

By

Published : Feb 20, 2019, 11:57 PM IST

అమెరికాలో దుండగులు రెచ్చిపోయారు. తెలంగాణకు చెందిన వ్యక్తిని బలి తీసుకున్నారు.ఫ్లోరిడాలోని డిపార్టుమెంటల్​స్టోర్​లోకి చొరబడి తుపాకులతో తెగబడ్డారు. ఈ కాల్పుల్లోతెలంగాణ వాసి కొత్త గోవర్ధన్​రెడ్డి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.

ఏడేళ్ల క్రితం ఉద్యోగరీత్యా ఫ్లోరీడాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు గోవర్ధన్​రెడ్డి. డిపార్టుమెంటల్ స్టోర్​లో మేనేజర్​గా విధులు నిర్వర్తిస్తున్నాడు. భార్యాపిల్లలు హైదరాబాద్ ఉప్పల్​లో నివసిస్తున్నారు.గోవర్ధన్​రెడ్డి మరణవార్తవిని శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని తరలించేందుకు ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండిమసూద్​పై ఫ్రాన్స్ గురి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details