ముఖ్యమంత్రితో రాయపాటి సోదరుల భేటీ - guntur
ఎమ్మెల్సీ స్థానాలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించి అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు మొదలుపెట్టారు. కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంపై ఆసక్తి పెంచుకున్న రాయపాటి శ్రీనివాస్... తన సోదరుడు ఎంపీ సాంబశివరావుతో పాటు సీఎంని కలిసి తన కోరికను విన్నవించారు.
brothers met cm
ముఖ్యమంత్రి చంద్రబాబును ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఆయన సోదరుడు రాయపాటి శ్రీనివాస్‌కలిశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని తనకు ఇవ్వాలని తెదేపా అధినేతను రాయపాటి శ్రీనివాస్ కోరారు. ఈ విషయాన్ని పరిశీలిస్తానని రాయపాటి కుటుంబానికి సీఎం చెప్పారు. రాయపాటి శ్రీనివాస్ వైపు తెదేపా మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. రెండు రోజుల్లో అభ్యర్థిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేయనున్నారు.