'హత్యరాజకీయాలు చేసే జగన్కు ఓటు అడిగే హక్కులేదు' - తెదేపా బహిరంగ
హత్యరాజకీయాలు చేసే జగన్కు రాష్ట్ర ప్రజలను ఓటు అడిగే హక్కులేదని ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెదేపా ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందన్నారు.శ్రీకాకుళం జిల్లాలో పదికి పది అసెంబ్లీ సీట్లు చంద్రబాబు నాయుడుకి బహుమానంగా ఇస్తామన్నారు.
పేద ప్రజలకు అండగా ఉంటూ సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రాభివద్ధే లక్ష్యంగా తెదేపా పని చేస్తుందని ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో తెదేపా ఎన్నికల సన్నాహక సభలో ప్రసంగించిన ఆయన రైతు పక్షపాతిగా తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహారిస్తోందని వ్యాఖ్యానించారు. గత 5 సంవత్సరాలుగా అపర భగీరథుడి లాగా చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారని కొనియాడారు. పోలవరం ప్రాజెక్ట్ను మహాయజ్ఞంగా పూర్తి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోదీని ఎదురించారన్నారు. హత్య రాజకీయాలు చేసే జగన్కు రాష్ట్ర ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని విమర్శించారు.