ముస్లిం ఉద్యోగులు గంట ముందే వెళ్లిపోవచ్చు! - ramjan
రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు పనివేళలు సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓ గంట ముందే విధుల నుంచి ఇంటికి వెళ్లేలా అవకాశం కల్పించింది.
ముస్లిం ఉద్యోగులు గంట ముందే వెళ్లిపోవచ్చు
రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పనివేళలు సడలించేలా ప్రభుత్వ కార్యదర్శి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకూ ఈ సడలింపు వర్తిస్తుందన్నారు. రంజాన్ మాసం మొత్తం.. పని వేళల్లో.. సాయంత్రం గంట ముందుగానే ఇంటికి వెళ్లేందుకు ఈ మేరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మే 6 నుంచి జూన్ 5 వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉండనున్నాయి.
Last Updated : May 10, 2019, 10:30 AM IST