ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం నివాస ప్రాంతంలో పోలీస్ యాక్ట్ 30 - పోలీసులు

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసం పరిసరాల్లో ఆందోళనలపై పోలీసుల నిషేదాజ్ఞలు జారీ చేశారు. సీఎం నివాస ప్రాంతంలో పోలీస్​ యాక్ట్​ 30 అమల్లో ఉన్నందున...ఎలాంటి ఆందోళనలూ నిర్వహించడానికి వీళ్లేదని గుంటూరు అర్బన్ ఎస్పీ రామకృష్ణ తెలిపారు.

police_restriction_at_cm_house

By

Published : Jul 10, 2019, 6:01 AM IST

పోలీసుల అనుమతి లేకుండా ఆందోళనలు నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామ వాలంటీర్ల ద్వారా రేషన్ సరకులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందనే సమాచారం నేపథ్యంలో డీలర్ల సంఘం ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని ప్రకటించింది. ఈ సమాచారంతో పోలీసుల సీఎం ఇంటి వద్ద ఆందోళనపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details