పర్యావరణాన్ని పరిక్షించాల్సిన బాధ్యత గనులశాఖ పైన ఉందని సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం స్పష్టం చేశారు. సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన గనుల తవ్వకాల్లో నియమనిబంధనలు పాటించి తీరాల్సిందేనని తేల్చి చెప్పారు. ఆదాయం మాత్రమే లక్ష్యంగా కాకుండా... పర్యావరణ పరిరక్షణపై కూడా ఆ శాఖ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఏపీలో గనుల అన్వేషణలో చేస్తున్న కృషిని ప్రధాన కార్యదర్శికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఎం.శ్రీధర్ వివరించారు. రాష్ట్రంలోనిర్మిస్తున్న అనేక నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో జీఎస్ఐ సాంకేతికసహకారం అందిస్తోందని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా చింగూర్ గుంటలో 2 వేల 470 కోట్ల విలువైన బంగారు నిక్షేపాలను గుర్తించామని వెల్లడించారు. ఈసందర్భంగా జీఎస్ఐ అధికారులు రూపొందించిన 'గ్రింప్సెస్ ఆఫ్ జీఐఎస్ యాక్టివిటీస్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్' అనే పుస్తకాన్ని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు.
పర్యావరణమూ... ప్రధానమే :సీఎస్ - cs rivew
ఆదాయంతో పాటు పర్యావరణ పరిక్షణపై కూడా గనుల శాఖ దృష్టిసారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం సంబంధిత గనుల శాఖ అధికారులను ఆదేశించారు.ఎక్కడా అవకతవకలకు పాల్పడకుండా కార్యాచరణ చేపట్టాలని స్పష్టం చేశారు.
సీఎస్ సమీక్ష
ఇదీ చదవండి