'ఇది అందరి విజయం'
జాతీయ జల అవార్డుల్లో రాష్ట్రానికి ఏడు అవార్డులు రావడం పట్ల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆనందం వ్యక్తం చేశారు. అందరి కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు.
జాతీయ జల అవార్డుల్లో ఏడు కేటగిరీల్లో రాష్ట్రానికి అవార్డులు రావడం పట్ల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంతోషం వ్యక్తం చేశారు. భూగర్భ జలాల సంరక్షణలో దేశంలోనే ఏపీ ముందుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం కష్టపడి పనిచేస్తున్నారన్నారు.విశాఖపట్నం, కడప, అనంతపురం, కర్నూలు అధికారులు నీటి నిర్వహణ కోసం చాలా కష్టపడ్డారని గుర్తు చేశారు. ఇప్పటివరకు పోలవరానికి రూ.10,790 కోట్లు ఖర్చుపెట్టినట్లు చెప్పారు. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం ద్వారా నీటి కొరతను అధిగమించామన్న దేవినేని.. అవార్డులను అందరి విజయంగా అభివర్ణించారు.