ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం: చంద్రబాబు
ప్రస్తుతం ప్రజాస్వామ్య పరిరక్షణ ఎంతో అవసరం ఉందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సేవ్ ఇండియా నినాదంతో మేమంతా ఒక్కటయ్యామని ఉద్ఘాటించారు.
దిల్లీలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు
దిల్లీలో శరద్ పవార్ నివాసంలో విపక్షనేతల కీలక సమావేశం ముగిసింది. భేటీ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు... ప్రస్తుతం ప్రజాస్వామ్య పరిరక్షణ ఎంతో అవసరం ఉందని వ్యాఖ్యానించారు. సేవ్ ఇండియా నినాదంతో మేమంతా ఒక్కటయ్యామని స్పష్టం చేశారు. అన్ని పార్టీలు కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని పునరుద్ఘాటించారు. త్వరలోనే ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. అమరావతిలో సమావేశ నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.