సైనికుల కోసం శ్రీమంతుడు
సైనికుల త్యాగాలను స్మరిస్తూ దిల్లీ యువకుడు సైకిల్ యాత్ర చేస్తున్నాడు. పనిలో పనిగా రోడ్డు భద్రత, శిరస్త్రాణం, సీటు బెల్టుపై అవగాహన కల్పిస్తున్నాడు. ఇప్పటి వరకు 16 రాష్ట్రాలు చుట్టేశాడు.
సరిహద్దు లోపల జనం ప్రాణాలు సురక్షితంగా ఉండాలంటే.. సైనికులు ప్రాణం పణంగా పెట్టి రేయింబవళ్లు కాపలా ఉండాలి. ఏదైనా దుర్ఘటన జరిగితే తప్ప వారిని పట్టించుకోం. అప్పుడే వారి విలువ తెలుస్తుంది. దేశభక్తి గుర్తొస్తుంది. ఓ యువకుడు మాత్రం అలా కాదు... జవాన్ల సేవలకు సెల్యూట్ చేస్తూ... సైకిల్ యాత్ర మొదలుపెట్టాడు. దిల్లీలో యాత్ర ప్రారంభించి అన్ని రాష్ట్రాలు చూట్టేస్తున్నాడు. రోడ్డు భద్రత, శిరస్త్రాణం, సీటు బెల్టుపై అవగాహన కల్పిస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్నాడు.