ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భీమిలి బరిలో లోకేశ్..?

విశాఖ, అనకాపల్లి పార్లమెంటు పరిధిలో సగం కంటే ఎక్కువ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు... చంద్రబాబు మళ్లీ అవకాశం కల్పించారు. మిగతా స్థానాలపై నిర్ణయాన్ని వాయిదా వేయడంతో... జిల్లా నేతల్లో ఉత్కంఠ నెలకొంది. లోకేశ్ భీమిలి నుంచి పోటీ చేస్తారనే ప్రచారానికి బలమిస్తూ... భీమిలిపై ఇంకా నిర్ణయం ప్రకంటించలేదు. మంత్రి గంటా ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

సమీక్షిస్తున్న చంద్రబాబు

By

Published : Mar 9, 2019, 7:08 AM IST

సమీక్షిస్తున్న చంద్రబాబు

విశాఖ, అనకాపల్లి పార్లమెంటు పరిధిలో అసెంబ్లీ స్థానాల్లో... ప్రస్తుత ఎమ్మెల్యేలకే చంద్రబాబు ప్రాధాన్యమిచ్చారు. మొత్తం 14 స్థానాల్లో... 9 స్థానాలను సిట్టింగ్​లకే కేటాయించారు. విశాఖపట్నం తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణ... దక్షిణం నుంచి వాసుపల్లి గణేష్​కుమార్... పశ్చిమం నుంచి గణబాబులను ఖరారు చేశారు. గాజువాక పల్లా శ్రీనివాసరావుకే ఖరారు అయ్యింది.

భీమిలి... విశాఖ ఉత్తరం... స్థానాలపై అధినేత నిర్ణయం తీసుకోలేదు. మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండగా... ఇక్కడి నుంచి మంత్రి లోకేశ్పేరు పరిశీలనలోకి రావటం చర్చనీయాంశంగా మారింది. లోకేశ్ భీమిలి నుంచి పోటీ చేస్తే... విశాఖ ఉత్తరం నుంచి గంటా పోటీ చేసే అవకాశం వుంది. ఎస్.కోటకు సిట్టింగ్ ఎమ్మెల్యేకోళ్ల లలితకుమారినిఖరారు చేశారు. విశాఖపట్నం పార్లమెంటు టిక్కెట్​ను గీతం విద్యాసంస్థల అధ్యక్షుడు భరత్‌ ఆశిస్తున్నారు. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.

అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి కొణతాల రామకృష్ణ పేరు పరిశీలనలో ఉంది. త్వరలోనే ఆయన పార్టీలో చేరనున్నారు. ఇదే స్థానానికి ఆడారి ఆనంద్ పోటీపడుతున్నారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో పెందుర్తికి బండారు సత్యనారాయణ మూర్తి... యలమంచిలికి పంచకర్ల రమేష్... నర్సీపట్నానికి చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఖరారు చేశారు.

చోడవరం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేకె.ఎస్.ఎన్.రాజు మళ్లీ బరిలోకి దిగనున్నారు. అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పీలా గోవింద్ ఉన్నారు... ఈ స్థానంలో సిట్టింగ్​తో పాటు కొత్త పేర్లూ పరిశీలనలోఉన్నట్లు తెలుస్తోంది. పాయకరావుపేట నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు పోటీ ఎక్కువైంది. ఇక్కడ నుంచి పుచ్చా విజయ్​కుమార్, చెంగల వెంకట్రావు కుమార్తెలు టికెట్​ ఆశిస్తున్నారు.

ఇదీ చదవండి...

పాయకరావుపేటకు పోటీ ఎక్కువే


ABOUT THE AUTHOR

...view details