ఈ నెల 23న జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి తెలిపారు. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు కృష్ణా యూనివర్శిటీలో జరగనున్నట్లు తెలిపిన ఆయన...ఓట్ల లెక్కింపు సమయంలో ప్రజలు, రాజకీయ పార్టీలు పోలీసులకు సహకరించాలని కోరారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల బందోబస్తుతో పాటు 144 సెక్షన్ ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ముందస్తు భద్రత చర్యలు చేపట్టామంటున్న ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
''కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్'' - ఎస్పీ
ఈ నెల 23న జరిగే ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కృష్ణా జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతతో పాటు, 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఏ పార్టీ గెలిచినా.. నాయకులంతా హుందాతో వ్యవహరించాలని కోరారు.
కృష్ణా జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి