'తప్పుడు ఓట్లు తొలిగించాలి'
రాష్ట్రంలో నెలకొన్న ఓట్ల సందిగ్థానికి త్వరలో పరిష్కరించాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు ఎంపీ జీవీఎల్ అన్నారు. నకిలీ ఓట్లు తొలగించాలని డిమాండ్ చేశారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో ఈ పార్టీ నేతలు దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న ఓట్ల తొలిగింపు సందిగ్ధంపై ఈసీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం మాట్లాడిన ఎంపీ జీవీఎల్ ఎన్నికల్లో గెలిచేందుకు కొన్ని పార్టీలు ఓట్ల తొలిగింపుకు ఉద్దేశపూర్వకంగా ఫారం-7 అప్లై చేశారన్నారు. జాబితాలో తెదేపా వ్యతిరేకుల ఓట్లు లేకుండా తొలిగిస్తున్నారని ఆరోపించారు. ప్రైవేటు వ్యక్తుల చేతికి ఓట్ల జాబితా, ఆధార్ సమాచారం ఎలా వెళ్లిందని ప్రశ్నించారు. ఓట్ల తొలిగింపు, డేటా చౌర్యంపై సమగ్ర విచారణ జరగాలని జీవీఎల్ అన్నారు. ఫారం-7 ఎవరైనా దాఖలు చేయవచ్చన్న ఎంపీ, ఈ అంశంపై ఈసీ నిర్ణయం ఉంటుందన్నారు.