ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

9వేలకు పైగా గ్రామ సచివాలయాల ఏర్పాటు!

గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాల పంపిణీలో పారదర్శకతను పెంచుతామన్న సీఎం హామీకి అనుగుణంగా అధికారులు అడుగులు వెేస్తున్నారు. ఇప్పటికే గ్రామ వాలంటీర్ల నియామకానికి ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం...గాంధీ జయంతి నాటికి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

ఎల్వీ సుబ్రమణ్యం

By

Published : Jul 4, 2019, 4:29 PM IST

అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,055 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీల్లో నూతనంగా 9,480 గ్రామ సచివాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చినట్లు సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం తెలిపారు. వీటిలో ఒక గ్రామ పంచాయతీతో కూడిన సచివాలయాలు 6,168... ఒకటి కంటే ఎక్కువ పంచాయతీలతో కూడినవి 3,312 ఉన్నట్లు వెల్లడించారు. 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం గ్రామ పరిపాలన వ్యవస్థ లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎస్ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details