రేపటి నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో రాజన్న బడిబాట కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందించడం, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు కమిటీ వేయడం, విద్యా వ్యవస్థలో మార్పుల కోసం అవసరమైతే సలహా మండలి సైతం ఏర్పాటు చేస్తామన్నారు. విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయడమే తమ ముందున్న సవాలుగా చెబుతున్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
రాజన్న బడి బాటతో పూర్వవైభవం: విద్యాశాఖ మంత్రి
రాజన్న బడి బాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకురావాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు.
education_minister_adhimulapu_suresh_interview