ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాంగ్రెస్‌ 'బ్లాక్‌' డే - RAHUL GANDHI

మోదీకి నల్లజెండాలతో నిరసన తెలుపుతామని రఘువీరారెడ్డి తెలిపారు. రాహుల్‌తో భేటీ అనంతరం రఘువీరా ప్రకటించారు. ఈ నెలాఖరుకు అభ్యర్థుల ప్రకటనకు కసరత్తు చేస్తున్నట్లు వివరించారు.

దిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న రఘువీరారెడ్డి

By

Published : Feb 9, 2019, 6:29 PM IST

ప్రధాని మోదీ పర్యటనకు నిరసనగా నల్లజెండాలతో ప్రదర్శన చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. 2019 ఎన్నికల సమాయత్తంపై రాహుల్​గాంధీతో సమావేశమైన రఘువీరారెడ్డి ఈ మేరకు ప్రకటించారు. మోదీ పర్యటనను అడ్డుకోబోమని స్పష్టం చేసిన ఆయన... నిరసన మాత్రం తెలియజేస్తామని వెల్లడించారు. ఆదివారం బ్లాక్ డేగా పాటిస్తుందన్నారు. ఫిబ్రవరి చివరి నాటికి అభ్యర్థుల ఖరారు పూర్తి చేయనున్నట్టు వివరించారు. మేనిఫెస్టోను ఈ నెలాఖరుకు ప్రకటిస్తామని తెలిపారు. మార్చి మొదటి వారంలో ప్రత్యేక హోదా భరోసా యాత్ర నిర్వహిస్తామని... రాహుల్, ప్రియాంకగాంధీ పాల్గొంటారని పేర్కొన్నారు.

దిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న రఘువీరారెడ్డి

ABOUT THE AUTHOR

...view details