నేడు కర్నూలు వంతు - nandyala
కర్నూలు, నంద్యాల పార్లమెంటు నియోజక వర్గాల నేతలతో సీఎం సమావేశమవనున్నారు. కొన్ని స్థానాల్లో అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేయనున్నారు.
సీఎం సమీక్ష
అమరావతిలో కర్నూలు, నంద్యాల నేతలతో నేడు సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం కర్నూలు, సాయంత్రం నంద్యాల నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి నేతలతో చర్చించనున్నారు. కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులు పేర్లు ప్రకటించే అవకాశం ఉంది.
Last Updated : Feb 22, 2019, 9:44 AM IST