విదేశీ పర్యటనకు తెదేపా అధినేత చంద్రబాబు - తెదేపా అధినేత
మెున్నటి వరకు ఎన్నికల, ఫలితాలు, సమావేశాలతో తీరిక లేకుండా ఉన్న తెదేపా అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లారు.
విదేశీ పర్యటనకు తెదేపా అధినేత చంద్రబాబు
కుటుంబసభ్యులతో కలిసి వారం రోజుల పాటు వ్యక్తిగత పర్యటనలో భాగంగా చంద్రబాబు విదేశాలకు వెళ్లారు. ఈనెల 27వ తేదీన తిరిగి రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచే ఈ పర్యటన చేపట్టాల్సి ఉన్నా అసెంబ్లీ సమావేశాల కారణంగా వాయిదా వేసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన కారణంగా ఏటా వెళ్లినట్లే ఈసారి విదేశీ పర్యటనకు వెళ్లారు.