ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం - amaravathi
సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. దిల్లీలో జరిగిన ధర్మపోరాట దీక్షకు మద్దతు తెలిపిన నేతలకు, వివిధ సంఘాల ప్రతినిధులకు ఈ సమావేశంలో కృతజ్ఞత తెలుపనున్నారు. గిరిజన వృద్దులకు ఫించను వయసును 60 నుంచి 50వరకు తగ్గించారు. దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. అన్నదాత సుఖీభవ పథకం, గ్రీన్ కారిడార్ అంశం, 60సంవత్సరాలు దాటిన ప్రతీ జర్నలిస్టుకు ఫించను ఇచ్చే అంశాలు చర్చకు రానున్నాయి. ఈ నెల 14న ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కోడ్ ముగిసేలోపు సార్వత్రిక ఎన్నికలకు కోడ్ వచ్చే అవకాశం కనిపిస్తోంది . ఈ నేపథ్యంలో పలు కీలక బిల్లులకు ఈ సమావేశంలో ఆమోదం లభించే అవకాశాలున్నాయి.