మీడియా సమావేశంలో బుద్దా వెంకన్న ఎన్నికల సంఘం ముసుగులో కేసుల మాఫీ కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లారని ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న విమర్శించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఓట్లు తొలగింపు అంశం ఎన్నికల సంఘం పరిధిలో ఉంటుందన్నారు. వారికి తప్ప ఓట్లు తొలగింపు చేసే అధికారం ఇంకోకరికి ఉండదన్నారు. ఈ విషయం జగన్కు తెలియకపోవడం దారుణమన్నారు.