ఆరోగ్య శ్రీకి వర్తింపులు ఇలా...
- వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువగా ఉన్న అన్ని కుటుంబాలకు(నెలకు రూ.40,000 ఆదాయం కలిగిన కుటుంబాలకు) వర్తిస్తుంది.
- వైద్య ఖర్చులు రూ 1,000లు మించిన అన్ని కేసులు.
- చికిత్స వ్యయంపై ఏ విధమైన పరిమితి లేకుండా అన్ని కేసులకు చికిత్సను అందించడం, సరిహద్దు జిల్లాలలో ప్రజల ప్రయోజనం కోసం రాష్ట్రానికి సరిహద్దులైన బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లోని మంచి ఆస్పత్రులను ప్రభుత్వ జాబితాలో చేరుస్తారు.
- అన్ని రకాల రోగాలు, సర్జరీలను ఆరోగ్యశ్రీ కింద వర్తింప జేస్తారు. మరో 5 లక్షల మందికి వర్తించనుంది.
'108' కి 179.76 కోట్లు..
రాష్ట్రంలో ప్రతి ప్రదేశానికి, ప్రతి మండలానికి ఒక 108 ఉండటమే ప్రభుత్వ ధ్యేయమని బుగ్గన వెల్లడించారు. మొత్తం 143.38 కోట్లతో కార్యక్రమ సంబంధ వ్యయంతో 432 ఆదనపు వాహనాలను సేకరించి, సర్వీసు నాణ్యతను మెరుగు పరుస్తారు.