''మా సంగతి తేల్చడానికి మీరెవరయ్యా?'' - చలసాని శ్రీనివాస్
కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తే.. సహించేది లేదని చెప్పారు.
రాష్ట్రం పట్ల కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఆరోపించారు. గుంటూరులో నిర్విహించిన ఆ సంఘం రాష్ట్ర సమావేశానికి ఆయన హాజరయ్యారు. కొత్త ప్రభుత్వాన్ని సైతం అస్థిరపర్చేందుకు ఉత్తరాది పార్టీ ప్రయత్నిస్తోందని విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రజలు చేవలేనివారు కాదన్నారు. అధికార పార్టీని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను అడ్డుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వం విషయంలోనూ ఇలాంటి ప్రయత్నాలు జరిగాయని గుర్తు చేశారు. చేతనైతే.. పోలవరానికి, రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ అండగా నిలవాలన్నారు.