Women Employees Bargaining Of Sarees: పైఅధికారి ఆ రోజు విధులకు రాలేదు. వారికి దారినపోయే చీరలు విక్రయించే వ్యాపారి కనిపించాడు. కాస్త ఆటవిడుపుగా ఉంటుందనుకున్నారేమో... ఏకంగా ప్రభుత్వ కార్యాలయాన్ని చీరల దుకాణంగా మర్చారు. తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలను మరిచి.. ప్రభుత్వ ఉద్యోగులు చీరలను కొనుగోలు చేసే వీడియో వైరల్ కావడంతో. చీరల కొనుగోలు వ్యవహారంలో పాల్గొన్న ఉద్యోగులకు.. ఉన్నతాధికారులు నోటీసులిచ్చిన ఘటన బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది.
బాపట్ల జిల్లా బల్లికురవ మండల పరిషత్ కార్యాలయంలో ప్రభుత్వ అధికారులు సోమవారం చీరాల కొనుగోలు కార్యక్రమం చేపట్టారు. కార్యాలయంలోని మహిళా ఉద్యోగులకు పంచాయితీ కార్యదర్శి దగ్గరుండి చీరాల క్రయ, విక్రయాలు జరిపించాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాతో పాటుగా ,స్థానికంగా హల్ చల్ అవుతున్నాయి. బల్లికురవ మండలాభివృద్ధి అధికారి (ఎంపీడీవో ) ఇంచార్జి కావడం రెండు మండలాలను చూస్తుండటంతో స్థానిక కార్యాలయంలోని ఉద్యోగులు విధుల పట్ల నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఎంపీడీవో మరో మండలమైన ఇంకొల్లులో విధినిర్వహణలో ఉన్నారు. తమ పైఅధికారి రాకపోవడంతో కిందిస్థాయి ఉద్యోగులు తమ విధులను మరచి దారినపోయే చీరల అమ్మే వ్యక్తిని పిలుచుకొని కొనుగోలు చేసిన వీడియోలు వైరల్గా మారాయి.