ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాపట్ల జిల్లాలో సంక్రాంతి వేడుకలు.. ఎద్దుల బల ప్రదర్శన

Bull Race : సంక్రాంతి అంటేనే సరదాలతో పాటు పలు రకాల పోటీలు. ఇందులో భాగంగా బాపట్ల జిల్లాలో రాష్ట్రస్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఈ పోటీలో ఎడ్లతో 12 క్వింటాళ్ల బరువు, 9 క్వింటాళ్ల బరువుతో నిర్ణీత సమయంలో ఎక్కువ సార్లు తిరిగిన ఎడ్ల జతని విజేతగా ప్రకటిస్తారు.

bull racing
ఎద్దుల పందెం

By

Published : Jan 15, 2023, 8:17 PM IST

Bull Race : సంక్రాంతి సంబరాల్లో భాగంగా బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంబోట్లవారిపాలెంలో రాష్ట్రస్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. అన్నంబోట్లవారిపాలెంలో రెండు చోట్ల ఒంగోలుజాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు జరుగుతున్నాయి. గొట్టిపాటి హనుమంతరావు మెమోరియల్ క్రీడాప్రాంగణంలో 4 పళ్ల విభాగంలో పోటీలు జరుగుతుండగా 10 ఎడ్ల జతల పాల్గొన్నాయి. 9 క్వింటాళ్ల బరువుతో నిర్దేశిత సమయంలో ఎక్కువ సార్లు తిరిగిన ఎడ్ల జతని విజేతగా ప్రకటిస్తారు. అలాగే అదే గ్రామంలోని గోరంట్ల రత్తయ్య చౌదరి ప్రాంగణంలో 6 పళ్ల విభాగంలో పోటీలు జరుగుతుండగా 12 క్వింటాళ్ల బరువు నిర్దేశిత సమయంలో లాగాల్సి ఉంటుంది. 12 ఒంగోలుజాతి ఎడ్ల జతలు పోటీల్లో పాల్గొంటున్నాయి. సంక్రాంతికి ఇతరప్రాంతాల నుంచి వచ్చినవారు, పశుపోషకులు, గ్రామస్థలు పోటీలను తిలకించేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు.

ABOUT THE AUTHOR

...view details