ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంత ప్రభుత్వాస్పత్రిలో దారుణం.. నర్స్​ అవతారమెత్తిన స్వీపర్​​ - అనంతపురం

Govt General Hospital: ఆసుపత్రిలోని కాన్పుల వార్డులో ఓ స్వీపర్ రోగికి సెలైన్ ఎక్కి స్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ వీడియో రోగి సహాయకుల్లో ఒకరు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఆసుపత్రిలోని నర్సుల విధులు.. స్వీపర్లతో చేయిస్తుండటం గమనార్హం.

Govt General Hospital
Govt General Hospital

By

Published : Feb 8, 2023, 10:33 PM IST

Govt General Hospital: అనంతపురంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని కాన్పుల వార్డులో ఓ స్వీపర్ రోగికి సెలైన్ ఎక్కిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. సాధారణంగా కాన్పుల వార్డులో ఇతరులను లోపలికి అనుమతించరు. అయితే రోగి సహాయకుల్లో ఒకరు వీడియోను తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఆసుపత్రిలోని కొన్ని వార్డుల్లో నర్సులు కదలకుండా విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే స్వీపర్లతో సెలెన్ ఎక్కించడం.. సరి చేయడంలాంటివి చేయిస్తుండటం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details