అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం యల్లనూరు రైల్వేగేటు సమీపంలో రైలు కిందపడి చేనేత కార్మికుడు బలవన్మవణానికి పాల్పడ్డాడు. పట్టణంలోని వివేకానగర్కి చెందిన బండారు కృష్ణమూర్తి చేనేత పనులు చేస్తుంటాడు. కొన్ని రోజుల క్రితం పాత మగ్గాలు తీసేసి విద్యుత్ మగ్గాలు ఏర్పాటు చేసుకున్నాడు. దీనికోసం లక్ష రూపాయలు అప్పు చేశాడు. ఆరోగ్యం బాగాలేదని రాత్రంతా సరిగా పడుకోలేదని... ఇప్పుడే వస్తానని చెప్పి తెల్లవారుజామున బయటకు వెళ్లాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంతలో ఇలా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందని కన్నీమున్నీరు అవుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారుపోలీసులు.
రైలు కింద పడి చేనేత కార్మికుడి ఆత్మహత్య - తాడిపత్రి
ఏం కష్టమొచ్చిందో తెలియదు. చేనేత కార్మికుడు ప్రాణాలు వదిలాడు. తాడిపత్రిలో రైలుకింద పడి నేతన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడే వస్తానంటూ వెళ్లాడనీ.. ఇలా ప్రాణాలు తీసుకుంటాడని తెలియదని కుటుంబసభ్యులు రోధించారు.
రైలు కింద పడి చేనేత కార్మికుడి ఆత్మహత్య