ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా ధాటికి మూడురోజుల్లో ముగ్గురు ఉద్యోగులు మృతి

మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు ఉద్యోగులు కరోనాతో మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. ఈ వరుస మరణాలతో.. అనంతపురం జిల్లా కదిరిలోని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

employees died with covid in kadiri
కదిరిలో కరోనాతో ఉద్యోగులు మృతి

By

Published : Apr 26, 2021, 7:48 PM IST

కరోనాతో మృతి చెందిన ఉద్యోగులు

అనంతపురం జిల్లా కదిరి డివిజన్​లో కరోనా కలకలం రేపుతోంది. మహమ్మారి దెబ్బకు మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు ఉద్యోగులు బలైపోయారు. తనకల్లు మండలంలోని మేజర్ పంచాయతీ కార్యాలయం అటెండర్ గా పనిచేస్తున్న రమణమ్మ.. తిరుపతి స్విమ్స్ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పులివెందుల ఆర్టీసీ డిపోలో కండక్టరుగా పనిచేస్తోన్న వెంకటరమణ కొవిడ్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. గాండ్లపెంట మండల పరిషత్ కార్యాలయంలో ఏవోగా పనిచేస్తోన్న ప్రభాకర్ వైరస్ బారిన పడిన చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు.

ABOUT THE AUTHOR

...view details