అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలో ఏకధాటిగా కురుస్తున్న వర్షంతోప్రజల్లో హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి.మండలంలో మంగళవారం ఉదయానికి28.8మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతవరణ విభాగం అధికారి పెనుగొండ బాబు ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నా,కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.పది ఏళ్లలో ఇంత పెద్ద ఎత్తున వర్షం ఏనాడు కురవలేదని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పెనుగొండలో ఏకాధాటిగా వర్షం, సంతోషంలో రైతన్నలు - పెనుగొండలో ఓ మోస్తారు వర్షం ఏకాధాటిగా కురుస్తోంది.
అనంతపురం జిల్లా పెనుగొండలో ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో రైతన్నలు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. గత పది సంవత్సరాల ఇంతలా వర్షం కురవడం చూడలేదని గ్రామస్తులు చెబుతున్నారు.
పెనుగొండలో ఏకాధాటిగా మోస్తరు వర్షం..