అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉగాదిని పురస్కరించుకుని రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఈ సంవత్సరం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిస్తుండటం వల్ల దేవాదాయ శాఖ అధికారులు ఈ కార్యక్రమాలను రద్దు చేశారు. భక్తులు రాకుండా ఆలయాన్ని మూసివేశారు. కేవలం పురోహితులు, దేవాదాయ శాఖ అధికారులు మాత్రమే స్వామి వారి సేవలో పాల్గొని అధికారిక కార్యక్రమాలు నిర్వహించారు.
భక్తులు లేకుండానే కసాపురం ఆంజనేయ స్వామి ఉగాది ఉత్సవం - hanuman temple in kasapuram
రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించినందున ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదన్న ఉద్దేశంతో అధికారులు ఆలయాలను మూసివేశారు. ఫలితంగా భక్తులకు దేవతల దర్శనాన్ని నిలిపివేశారు. తాజాగా ఉగాది పర్వదినం సందర్భంగా అనంతపురం జిల్లాలోని కసాపురం ఆంజనేయ స్వామి ఉత్సవాల్లో కేవలం అధికారులే స్వామి కైంకర్యాలను నిర్వహించారు.
భక్తులు లేకుండానే కసాపురం ఆంజనేయ స్వామి ఉగాది ఉత్సవం