హిందూ ఆలయాలు, దేవస్థానాల ఆస్తులకు రక్షణ కల్పించాలంటూ అనంతపురం జిల్లా కదిరిలో తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. కదిరి పట్టణంలోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద పూజలు నిర్వహించారు. జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూ ధార్మిక సంస్థలపై దాడులు ఎక్కువయ్యాయన్నారు.
ఆలయాలకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీ నరసింహ స్వామి రథాన్ని తగులబెట్టిన దుండగులు గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో హిందూ ఆలయాలపై దాడులకు బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.