తెదేపా అధినేత చంద్రబాబు అనంతపురం జిల్లాకు రావాలంటే రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్న.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలపై తెదేపా బీసీ సెల్ నాయకులు చంద్రశేఖర్ యాదవ్ మండిపడ్డారు. కరవుతో అల్లాడుతున్న జిల్లాకు పరిశ్రమలు, నీరు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదన్నారు. రైతులతో పాటు అన్ని వర్గాల అభివృద్ధికి పాటుపడిన ఆయనను విమర్శించడం తగదని హితవు పలికారు. 7 నెలల కాలంలో అనంతపురం జిల్లాకు మాధవ్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలిచి చూపించాలని సవాల్ విసిరారు.
'చంద్రబాబును విమర్శిస్తారా.. జిల్లాకు మీరేం చేశారు'
తెదేపా అధినేత చంద్రబాబును విమర్శించే హక్కు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు లేదని.. తెదేపా బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌యాదవ్ అన్నారు. చంద్రబాబును అనే ముందు తాము జిల్లాకు ఏం చేశారో ఆలోచించుకోవాలని హితవు పలికారు.
తెదేపా బీసీ సెల్ అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్