ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆస్పత్రులకు వెళ్తూ.. వాహనాల్లోనే మృతి చెందుతున్న బాధితులు

అత్యవసరంగా ప్రభుత్వాసుపత్రికి వెళ్తున్న వాళ్లలో కొందరూ వాహనాల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా లక్షణాలు ఉన్నాయా ..? లేదో..? గ్రహించేలోపే తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందుతున్నారు. ఈ ఘటనలు అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంటున్నాయి.

survivors are losing their lives in vehicles at ananthapur
వాహనాల్లోనే మృతి చెందుతున్న బాధితులు

By

Published : May 19, 2021, 4:59 PM IST

అనంతపురంలోని స్టాలిన్​నగర్​కు చెందిన భాగ్యమ్మ.. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆమె కుమారుడు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తున్నాడు. క్రమంలో ఆస్పత్రి ప్రాగణంలో ఆటోలోనే ఆమె మృతి చెందింది. తల్లి మృతదేహం వద్ద ఆ కుమారుడు రోదిస్తున్న తీరు పలువురికి కంటతడి పెట్టించింది.

కూడేరు ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడు అనారోగ్యం పాలయ్యాడు. సమాచారం ఇచ్చినప్పటికీ సకాలంలో ఆంబులెన్స్ రాకపోవడంతో ఆటోలోనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతన్ని పరీక్షించిన వైద్యులు.. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలిపారు. ఇలా ఆటోలో వస్తున్న వారు కొందరైతే.. అంబులెన్సులు సకాలంలో రాకపోవడంతో ఇబ్బందులు పడుతు మృతి చెందుతున్న వారు మరికొందరు.

అస్వస్థతకు గురై అత్యవసరంగా ఆస్పత్రులకు వెళ్తున్న క్రమంలో వాహనాల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి తరణంలో కరోనా లక్షణాలు ఉన్నా.. లేకపోయినా ముందు జాగ్రత్తగా కొవిడ్ పరీక్షలు చేసుకోవాలని ప్రజలకు వైద్య సిబ్బంది కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details