ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీతాలు చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన - water plant employees protest at madakashira

జీతాలు వెంటనే చెల్లించాలని శ్రీరామిరెడ్డి తాగునీటి పథకంలో పనిచేసే కార్మికులు డిమాండ్​ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో... మడకశిర పట్టణంలోని కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

sriramireddy drinking water plant employees protest for salaries at madakashira mandal ananthapuram district
జీతాలు చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన

By

Published : Sep 24, 2020, 6:48 PM IST

అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని శ్రీరామిరెడ్డి తాగునీటి పథకంలో 1600 గ్రామాలకు చెందిన దాదాపు 700 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కరోనా పరిస్థితుల్లో కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారు. కష్టకాలంలో సేవలు చేసిన వారికి ఇప్పటికి జీతం చెల్లించడంలేదని యూనియన్​ రాష్ట్ర నాయకులు ఓబులు ఆరోపించారు. వేతనాలు చెల్లించాలని డిమాండ్​ చేస్తూ... సీఐటీయూ ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కార్మికులు, రైతులు, ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరారు.

కార్మికులకు ఇచ్చే జీతంలో సగభాగం వారి ప్రయాణాలకే సరిపోతుందన్నారు. మరణించిన కార్మికులకు పరిహారం అందించలేది పేర్కొన్నారు. గతంలో కార్మికుల పీఎఫ్ చెల్లించని కాంట్రాక్టర్లనే రాజకీయ పలుకుబడితో మళ్లీ నియమించారని కార్మికులు ఆరోపించారు. వీటికి తోడు సీఎం జగన్​... పంటపొలాలకు మీటర్లు బిగించాలని ఆదేశిస్తున్నారు. ఇలాంటి ప్రజావ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే జగన్​కు పుట్టగతులుండవని సీఐటీయూ రాష్ట్ర నాయకులు ఓబులు హెచ్చరించారు.

ఇదీ చూడండి:'రహస్య మంతనాల కోసమే ముఖ్యమంత్రి హస్తిన పర్యటన'

ABOUT THE AUTHOR

...view details