అక్రమ సంబంధంపై ప్రశ్నించాడని తండ్రిని చంపిన తనయుడు - murder
అనంతపురం జిల్లా రొద్దం మండలం జక్కలచెరువు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అక్రమ సంబంధం వదులుకోమని మందలించినందుకు కుమారుడే తండ్రిని దారుణంగా హత్య చేశాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.
అనంతపురం జిల్లా జక్కలచెరువుకు చెందిన గుల్ల అంజినప్ప (58), గుల్ల యల్లప్ప తండ్రీకొడుకులు. ఉదయం ఇద్దరూ కలిసి పొలం వెళ్లారు. యల్లప్ప... ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న తండ్రి నిలదీశాడు. ఆవేశానికి గురైన యల్లప్ప.. మల్బరీ ఆకులు కోసేందుకు తెచ్చిన కొడవలితో తండ్రి అంజినప్పపై దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన అతని తండ్రి.. ఘటనా స్థలంలోనే మృతి చెందాడని గ్రామస్థులు తెలిపారు. విషయం తెలుసుకున్న రొద్దం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.