అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన సిపాయి తిప్పేష్ ఒరిస్సాలో మృతిచెందగా... మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. ఇలాంటి సందర్భంలో.. బాధిత కుటుంబాన్ని అధికార, పాలక వర్గాలెవరూ పట్టించుకోలేదు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవానుకు సంతాపమూ తెలపలేదు. దేశ సిపాయిగా పని చేసిన వ్యక్తి.. మృతి చెందితే కనీసం పరామర్శించడానికీ ఎవరూ రాలేదని కుటుంబం కుంగిపోతోంది. సిపాయి శవాన్ని దహనం చేయకుండానే ధర్నాకు దిగింది. తమకు రావల్సిన ప్రయోజనాల గురించి అధికారులు స్పందించడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదంతా చూసిన వాళ్లు... మన సిపాయిని మనమే గౌరవించుకోకపోతే ఎలా సార్.. కొంచెం ఆలోచించండి.. అంటున్నారు.
మన జవానుని మనమే గౌరవించుకోవాలి కదా సార్....! - అనంతపురం జిల్లా
పోలీసులన్నా, జవానులన్నా మనం చాలా గౌరవిస్తాం...ఎందుకంటే మన ప్రాణానికి వారి ప్రాణాలు పణంగా పెడతారు కాబట్టి. మరి.. అలాంటి సిపాయి చనిపోతే... కడసారి గౌరవ వందనం కచ్చితంగా చేస్తాం. కానీ.. అనతంపురానికి చెందిన జవాను తిప్పేష్ చనిపోతే.. అక్కడి పోలీసులు కనీసం చూడటానికి కూడా రాకపోవడం విచారకరమో.. నిర్లక్ష్యమో వారికే తెలియాలి.
సిపాయికి దక్కని గౌరవవందనం