ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 17, 2020, 3:26 PM IST

ETV Bharat / state

పరీక్షలు రద్దు కోరుతూ ఎస్ఎఫ్ఐ ధర్నా.. ఉద్రిక్తం

కరోనా విజృంభించి ప్రజలు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని భయాందోళనలకు గురవుతుంటే శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ అధికారులు పరీక్షలకు ఏర్పాటు చేయడాన్ని విద్యార్థి నేతలు తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో పరీక్షలు రద్దు చేసి అందరినీ ప్రమోట్ చేయాలని ఎస్​ఎఫ్ఐ విద్యార్థి నేతలు ఆందోళన నిర్వహించారు.

పరీక్షలు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ నేతల ధర్నా.. పరిస్థితి ఉద్రిక్తం
పరీక్షలు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ నేతల ధర్నా.. పరిస్థితి ఉద్రిక్తం

కరోనా సమయంలో పరీక్షలన్నీ రద్దు చేయాలంటూ అనంతపురం జిల్లా ఎస్​కే యూనివర్సిటీ వద్ద ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు ధర్నా చేపట్టారు. ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే మరోవైపు యంత్రాంగం మాత్రం పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

అందరినీ ప్రమోట్ చేయాలి..

డిగ్రీ, బీటెక్, పీజీ పరీక్షలన్నింటినీ రద్దు చేసి విద్యార్థులను ప్రమోట్ చేయాలని నేతలు డిమాండ్ చేశారు. విద్యార్థుల పట్ల జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సూర్య చంద్ర హెచ్చరించారు. యూనివర్సిటీ ప్రాంగణంలో ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేసి ఠాణాకు తరలించారు.

పరీక్షలు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ నేతల ధర్నా.. పరిస్థితి ఉద్రిక్తం

ఇవీ చూడండి:

కల్వకుర్తి ఎత్తిపోతల వద్ద ఉద్రిక్తత.. రేవంత్​రెడ్డికి గాయం

ABOUT THE AUTHOR

...view details