SANDALWOOD: మడకశిరలో రూ.1.27కోట్ల విలువైన గంధం చెక్కలు పట్టివేత - అనంతపురం నేర వార్తలు
13:03 August 14
పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
కేరళ నుంచి అక్రమంగా శ్రీగంధం చెక్కలను రవాణా చేసి సెంటు తయారు చేస్తున్న ముఠాను అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. కేరళ నుంచి మడకశిర నియోజకవర్గానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు మూడు చోట్ల సెంటు పరిశ్రమలు ఏర్పాటు చేశారు. ఈ పరిశ్రమల యజమానులపై ఇప్పటికే కేరళలో పలు కేసులుండటంతో వీరి కదలికలపై నిఘాపెట్టిన పోలీసులు.. వారం రోజుల క్రితం శ్రీగంధం దుంగలతో లారీ అనంతపురం జిల్లాకు వెళ్లినట్లు గుర్తించారు.
ఈ విషయాన్ని కేరళ పోలీసులు.. అనంతపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో జిల్లా అటవీ, పోలీసు అధికారులు మూడు రోజులుగా నిందితుల పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించారు. నాలుగు టన్నుల శ్రీగంధం చెక్కలతోపాటు, 16 లీటర్ల శ్రీగంధం చెక్కల తైలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్కడ సూపర్ వైజర్‌గా పనిచేస్తున్న క్రిష్ణన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితులు సంకేష్ అబ్దుల్ రెహమాన్, మహమ్మద్ కుట్టీలు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. గంధం చెక్కలు, తైలం విలువ రూ.1.27 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. జిల్లా ఎస్పీ, అటవీశాఖ డీఎఫ్ఓలు సంయుక్తంగా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
ఇదీ చదవండి: