కొవిడ్ టీకా విషయంలో ఎలాంటి అపోహలు, ఆందోళనలు వద్దని అనంతపురం జిల్లా కదిరి ఆర్డీవో వెంకట్ రెడ్డి అన్నారు. వ్యాక్సినేషన్లో భాగంగా రెండో డోసు వేయించుకున్న ఆర్డీవో.. అందరూ టీకా వేసుకోవాలని సూచించారు. 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, 45 ఏళ్లు దాటి రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక జబ్బులు ఉన్న వారందరు టీకా వేసుకోవాలన్నారు. తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 156 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు వైద్యులు తెలిపారు.
'కరోనా టీకా విషయంలో అపోహలు వద్దు' - కదిరి తాజా సమాచారం
కరోనా టీకా విషయంలో ఎలాంటి అపోహలు వద్దని కదిరి ఆర్డీవో వెంకట్ రెడ్డి అన్నారు. వ్యాక్సిన్ రెండో డోసు వేసుకున్న ఆయన.. అందరూ టీకా వేసుకోవాలని పిలుపునిచ్చారు.
'కరోనా టీకా విషయంలో అపోహాలు వద్దు'