అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం బేలుగుప్ప మండలం రామనేపల్లి గ్రామ శివారులో నాటుసారా స్థావరాలపై సెబ్ అధికారులు దాడులు చేశారు. తయారీకి సిద్ధంగా ఉంచిన 300 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నాటుసారా దారులను గుర్తించి వారిపై కేసు నమోదు చేస్తామని సెబ్ అధికారి హరికృష్ణ తెలిపారు.
కర్ఫ్యూ కారణంగా మద్యం దుకాణాలు 12 గంటల వరకే ఉంటున్న కారణంగా.. నాటుసారా తయారీ ఇటీవల జోరందుకుంది. బేలుగుప్ప మండలం రామనేపల్లి గ్రామ శివారులో నాటుసారా తయారు చేస్తున్నట్లు కళ్యాణదుర్గం సెబ్ అధికారులకు సమాచారం వచ్చిన మేరకు... వారు సిబ్బందితో కలిసి దాడులు చేశారు.