ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి - ananthapuram district crime news

చిత్తూరు జిల్లా పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

By

Published : May 28, 2020, 5:07 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై పాకాల వారిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. నేండ్రగుంట నుంచి తిరుపతి వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని... తిరుపతి నుంచి చిత్తూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి తలకు బలమైన గాయమవటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు అమర్ రాజాలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:తెలంగాణ: బోరు మంటున్న చిన్నారుల ప్రాణాలు!

ABOUT THE AUTHOR

...view details