ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కూలీ కరెంట్ బిల్లును తగ్గించిన అధికారులు - latest news of etv bharat

అనంతపురం జిల్లాలో ఓ కూలి కుటుంబానికి రూ.1.48 లక్షల కరెంట్ బిల్లు వచ్చింది. ఈ అంశంపై ఈటీవీ భారత్​లో కథనం రాగా.. అధికారులు స్పందించారు. మీటర్ లోపాలను గుర్తించి టెస్టింగ్​కు తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.

responce for etv bharath on electricity bill
responce for etv bharath on electricity bill

By

Published : Sep 1, 2021, 10:08 AM IST

అనంతపురం జిల్లా విడపనకల్ మండలం పాల్తూరు గ్రామంలో పర్వతప్ప అనే కూలి కుటుంబానికి రూ.1.48 లక్షల కరెంట్ బిల్లు రావడంపై 'ఈటీవీ భారత్'లో వచ్చిన కథనంపై ఉన్నతాధికారులు స్పందించారు. గ్రామానికి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించిన డీఈఈ శేఖర్.. మీటర్​లో ఏదైనా లోపాలు ఉంటే టెస్టింగ్ కోసం తీసుకెళ్తామన్నారు. మొదట వచ్చిన బిల్లును రూ.56 వేలకు తగ్గించామని.. మీటర్​లో లోపాలుంటే మరింత తగ్గించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ప్రతిఒక్క కరెంట్ బిల్లు ఐఆర్​డీఏ ద్వారా స్కానింగ్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయినట్లు ఆయన తెలిపారు. అలా చేయడం ద్వారా కచ్చితమైన బిల్లు వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. తమ సమస్యను పరిష్కరించిన ఈటీవీ వారికి బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details