తక్కువ ధరకే బంగారం వస్తుందని ఆశపడిన ఓ వ్యక్తి మోసపోయిన ఘటన అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలంలో జరిగింది. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పుల్లారెడ్డికి నకిలీ బంగారు ముఠా సభ్యులతో పరిచయం ఏర్పడింది. 15 రోజులుగా వీరి మధ్య చరవాణీలో సంభాషణలను సాగుతున్నాయి. తమ వద్ద ఉన్న బంగారాన్ని తక్కువ ధరకే ఇస్తామని ముఠా సభ్యులు తెలిపారు. అనంతపురం జిల్లా, బెళుగుప్ప మండలంలోని గుండ్లపల్లి గ్రామం వద్దకు వచ్చి బంగారాన్ని తీసుకోవాలని కోరారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన వ్యాపారి గుండ్లపల్లికి బుధవారం చేరుకున్నాడు. సుమారు కిలో బరువున్న నాణేలను రూ.8 లక్షలకు కొనుగోలు చేశాడు. ముఠా సభ్యుడు.. పుల్లారెడ్డి కారులో కొంత దూరం ప్రయాణించి, ఫోన్లో మాట్లాడాలని అతని చరవాణీని తీసుకున్నాడు. మాట్లాడుతున్నట్లు నటిస్తున్న అతను.. ఫోన్ తో సహా పరారయ్యాడు. తర్వాత అనుమానం వచ్చి నాణేలను పరిశీలించిన వ్యాపారి.. నకిలీవిగా గుర్తించాడు.
నకిలీ బంగారం.. మోసపోయిన హైదరాబాద్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి - అనంతపురంలో నకిలీ బంగారు ముఠా చేతిలో మోసపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి
తక్కువ ధరకే బంగారం వస్తుందని ఆశపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారి.. నకిలీ బంగారం ముఠా సభ్యుల చేతిలో మోసపోయాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని బెళుగుప్ప మండలంలో జరిగింది.
నకిలీ బంగారు ముఠా చేతిలో మోసపోయిన హైదరాబాద్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి
మోసపోయానని గ్రహించిన బాధితుడు బెళుగుప్ప పోలీసులను ఆశ్రయించాడు. ముఠాలో మొత్తం ఐదుగురు సభ్యులున్నట్లు పోలీసులకు తెలిపాడు. ఈ క్రమంలో బెళుగుప్ప పోలీసుల సమాచారంతో అప్రమత్తమైన కణేకల్లు ఎస్సై సురేష్.. సిబ్బందితో కలిసి అడ్డుకొనే ప్రయత్నం చేశారు. కానీ దుండగులు తమ వాహనాలని హనకనహాల్ వైపు మళ్లించి తప్పించుకున్నారని బెళుగుప్ప ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.