'రేషన్ డీలర్ల నిరసన' - రేషన్ డీలర్లు
అనంతపురం జిల్లా గుంతకల్లులో రేషన్ డీలర్లు నిరసన బాట పట్టారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న తాము సేవలందిస్తున్నామని..అలాంటి మమ్మల్ని గ్రామ,వార్డ్ వాలంటీర్ వ్యవస్థ తొలగించే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
'రేషన్ డీలర్ల నిరసన'
గుంతకల్లులో తహసీల్దార్ కార్యాలయం ఎదుట రేషన్ డీలర్లు నిరసన చేపట్టారు. గ్రామ,వార్డ్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు రేషన్ సరుకుల పంపిణీ అందిచనున్న నేపథ్యంలో తమ ఉనికి ప్రశ్నార్థకం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్థను సమర్థిస్తున్నామని కానీ తమ ఉపాధి దెబ్బతినకుండా చూడాలని కోరారు. సరకుల పంపిణీలో పాత విధానాన్నే కొనసాగించాలని అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు.