అధికార వికేంద్రీకరణతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణ కావాలనే ముఖ్యమంత్రి.. 3 రాజధానుల ఆలోచన చేసినట్లు అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అన్నారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి ప్రజల హక్కులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. శాసన రాజధానిగా అమరావతి కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు, విశాఖపట్నంను కార్యనిర్వాహక రాజధానిగా చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. తెదేపా అధినేత చంద్రబాబు అనంతపురం పర్యటనలో కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా సమీక్షలు నిర్వహిస్తున్నారని ప్రకాష్ రెడ్డి విమర్శించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అనంతలో రక్తచరిత్ర సృష్టించవద్దని అన్నారు.
'అనంతలో.. మళ్లీ రక్తచరిత్ర సృష్టించవద్దు' - రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి లెటెస్ట్ కామెంట్స్
రాజధాని వ్యవహరంపై తెదేపా అధినేత చంద్రబాబు.. ప్రజలను రెచ్చగొట్టే ధోరణిలో ప్రవర్తిస్తున్నారని రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం అధికార వికేంద్రీకరణతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణ చేసేందుకూ ప్రయత్నిస్తోందన్నారు.
రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి
TAGGED:
ycp mla prakash reddy news