కొన్ని నెలలుగా తమకు జీతాలు ఇవ్వడం లేదంటూ అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని శ్రీ రామిరెడ్డి వాటర్ స్కీమ్ కార్మికులు ధర్నాకు దిగారు. నెల క్రితం కార్మికులు రిలే నిరాహారదీక్షలు, ఆందోళనలు చేసినా ప్రయోజనం లేదన్నారు. జిల్లాలోని పలు మండలాలకు వెళ్లే తాగునీటి సరఫరా ప్రధాన లైన్లను మూసివేసి కార్మికులు ఆందోళన చేశారు. తమకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు లేకుండా తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని వాపోయారు. సమస్యను పరిష్కరించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు.
బకాయిలు చెల్లించాలని రామిరెడ్డి వాటర్ స్కీమ్ కార్మికుల ధర్నా - rami reddy water scheme workers salaries
వైకాపా ప్రభుత్వం కార్మికులపై చిన్నచూపు చూస్తోందని ఉరవకొండ నియోజకవర్గంలోని శ్రీ రామిరెడ్డి వాటర్ స్కీమ్ కార్మికులు ఆరోపించారు. తమకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకుండా సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని... పీఏబీఅర్ పంప్ హౌస్ వద్ద ధర్నాకు దిగారు.
బకాయిలు చెల్లించాలంటూ.. శ్రీ రామిరెడ్డి వాటర్ స్కీమ్ కార్మికులు ధర్నా