అనంతపురం జిల్లా లేపాక్షి మండలం కొండూరు గ్రామానికి చెందిన మాలకొండప్ప అనే వ్యక్తి మృతి చెందాడు. మృతదేహాన్ని ఖననం చేసేందుకు స్థానిక శ్మశాన వాటికకు తీసుకువెళ్లారు. అక్కడ అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగా... అదే గ్రామానికి చెందిన రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి... ఈ భూమి తనదని, దీనికి సంబంధించిన పత్రాలూ తన వద్ద ఉన్నాయని అడ్డుకున్నాడు. ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన మాలకొండప్ప బంధువులు... మృతదేహంతో ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న లేపాక్షి ఎస్సై ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
శ్మశాన వాటికకు తీసుకువెళ్తే... అంత్యక్రియలను అడ్డుకున్నారు... - protest-with-dead-body-in-ananthapuram district
అనంతపురం జిల్లా కొండూరు గ్రామంలో మృతదేహంతో ఆందోళన చేపట్టారు. మృతదేహాన్ని ఖననం చేసేందుకు శ్మశాన వాటికకు తీసుకువెళ్లగా... ఈ భూమి తనదని ఓ వ్యక్తి అడ్డుకున్నాడు.
కొండూరులో మృతదేహంతో ఆందోళన