ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంటర్ పరీక్ష కోసం 96 కిలోమీటర్ల ప్రయాణం

విద్యార్థులకు సౌకర్యంగా ఉండే విధంగా పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తారు. కానీ అనంతపురం జిల్లా ఆగళి, రొళ్ల ప్రాంత విద్యార్థులు మాత్రం పరీక్ష రాయాలంటే 96కిలోమీటర్లు ప్రయాణించాలి. అవును! మీరు విన్నది నిజమే.. ఇది మాత్రమే కాదు. ప్రయాణ సమయంలో వాహనం మరమ్మతులకు గురైతే పరీక్ష రాసే అవకాశం కోల్పోవాల్సిందే. ప్రభుత్వం స్పందించి తమ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

problems-of-inter-students-in-ananthapuram-district
ఇంటర్ పరీక్ష రాయాలంటే 96 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే

By

Published : Mar 9, 2020, 3:29 PM IST

ఇంటర్ పరీక్ష రాయాలంటే 96 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే

అనంతపురం జిల్లా ఆగళి, రొళ్ల ప్రాంతాల విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయాలంటే 96 కిలోమీటర్లు ప్రయాణించి, పరీక్షా కేంద్రానికి చేరుకొవాల్సి వస్తోంది. వీరందరికీ మడకశిరలో కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు వాహనంలో ప్రమాదకరంగా ప్రయాణిస్తూ కేంద్రాలకు చేరుకుంటున్నారు. వీరు ప్రయాణించే సమయంలో వాహనం మరమ్మతులకు గురైతే తాము పరీక్ష రాసే అవకాశం కోల్పోవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమ మండల కేంద్రాల్లోనే పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details