అనంతపురం జిల్లా అమరాపురం మండలం నిద్రగట్ట గ్రామానికి చెందిన శోభ ఆరు నెలల గర్భవతి. వరకట్నం కోసం ఆమెను అత్తింటి వారు వేధింపులకు గురిచేశారు. వారి వేధింపులు తాళలేక చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలికి ఒక కుమారుడు ఉన్నారు.
అత్తింటి వేధింపులు తాళలేక గర్భిణీ ఆత్మహత్య - ananthapuram district crime news
అత్తింటి వేధింపులు తాళలేక ఆరు నెలల గర్భిణీ ఆత్మహత్య చేసుకుంది. తాను చనిపోతున్నానంటూ సూసైడ్ నోటు రాసి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా నిద్రగట్ట గ్రామంలో జరిగింది.
అత్తింటి వేధింపులు తాళలేక ఆరు నెలల గర్భిణీ ఆత్మహత్య