ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరుణుడి రాక కోసం.. సర్వమత పూజలు

దాదాపు రాష్ట్రమంతా వానలు, వరదలు హోరెత్తిస్తుంటే.. అనంతపురం జిల్లాలో మాత్రం చినుకు జాడ కరువైంది. అన్ని మతాల ప్రజలు కలిసి వాన కోసం ప్రార్థనలు, పూజలు చేస్తున్న దృశ్యం.. అక్కడి వారిలో ఆవేదనను తెలియజేస్తోంది.

వర్షం కోసం పూజలు

By

Published : Aug 13, 2019, 7:44 PM IST

వర్షం కోసం సర్వమత పూజలు

అనంతపురం జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వానలు ముఖం చాటేస్తున్న కారణంగా.. వేరుశనగ సాగు సమయం దాటి పోయింది. ఇతర ప్రాంతాల్లో కురుస్తున్నట్టే.. తమ జిల్లాలోనూ వానలు పడతాయన్న ఆశతో రైతులు పోలాలు దున్నుకుని సిద్ధంగా ఉన్నారు. అడపాదడపా జల్లులు పడుతున్నా.. ఆశించిన స్థాయిలో, అవసరాలు తీర్చే స్థాయిలో వర్షాలు పడటంలేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలోని కళ్యాణదుర్గంలో పూజలు, ప్రార్థనలు చేశారు. ఇప్పటికైనా వరుణదేవుడు కరుణించి తాగునీరు సమస్య లేకుండా, భూగర్భ జలాలు పెరగాలని అన్ని మతాలవారు ఆకాంక్షించారు. మారెమ్మ తల్లికి 101 బిందెలతో జలాభిషేకాలు చేశారు. ముస్లింలు పీర్ల దేవునికి 101 బిందెలతో అభిషేకం నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details