Anantapur Crime News: అనంతపురంలో కిడ్నాప్‌కు గురైన బాలుడు అచూకీని పోలీసులు ఎట్టకేలకు కనుగొన్నారు. బాలుడు సూరజ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో క్షేమంగా ఉన్నట్లు వారు తెలిపారు. జ్ఞాపకం లక్ష్మీకాంత్.. గతంలో సూరత్ తండ్రి బాబావలి దగ్గర బట్టల దుకాణంలో పని చేసేవాడు. డబ్బుల విషయంలో బాబావలి, లక్ష్మీకాంత్ మధ్య గొడవలు తలెత్తడంతో దుకాణం వదిలేసి బాబావలి మేస్త్రి పనికి వెళ్లాడు. ఈ క్రమంలో బాబావలిపై కోపం పెంచుకున్న లక్ష్మీకాంత్ తన కుమారుడిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయాలని పన్నాగం వేశాడు.
అనంతపురంలో కిడ్నాప్‌కు గురైన బాలుడు సురక్షితం - కిడ్నాప్‌కు గురైన బాలుడు సూరజ్
kidnapped boy is safe: అనంతపురం జిల్లాలో కిడ్నాప్‌కు గురైన బాలుడుని పోలీసులు సురక్షితంగా కాపాడారు. బాలుడు సూరజ్.. ప్రస్తుతం పోలీసుల అదుపులో క్షేమంగా ఉన్నట్లు తెలియడంతో ఆ తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.
పాత పరిచయంతో శుక్రవారం సాయంత్రం బాలుడిని కిడ్నాపర్ లక్ష్మీకాంత్ తీసుకెళ్లి, బాబావలిని బెదిరించాడు. బాబావలి ఫోన్ వచ్చిన బెదిరింపు కాల్ ఆధారంగా పోలీసులు కిడ్నాపర్ కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు తన వెంట పడుతున్నట్లు తెలుసుకున్న కిడ్నాపర్.. యాడికి సమీపంలో బాలుడుని వదిలేసి పరారయ్యారు. ప్రస్తుతం పోలీసుల సమక్షంలో బాలుడు క్షేమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి