అనంతపురం జిల్లా కుందుర్పి, కంబదూరు మండలాల పరిధిలోని గ్రామాల్లో ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు చేశారు. ఎనుముల దొడ్డి గ్రామ శివార్లలోని నాటుసారా తయారీ కేంద్రాలపై జిల్లా ఎస్పీ ఆదేశాలతో సివిల్, ఎస్.ఈ.బీ పోలీసులు తనిఖీలు చేశారు.
నాటు సారా తయారీని గుర్తించి 300 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 32 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేస్తున్నారు.